Wednesday, October 5, 2011

జూ ఎన్టీఆర్, ఊసరవెల్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..


జూ ఎన్టీఆర్, ఊసరవెల్లి అభిమానులకు బ్యాడ్ న్యూస్. రేపు సినిమా విడులవుతున్న నేపథ్యంలో బ్యాడ్ న్యూస్ అంటూ బాంబు పేలుస్తున్నారేంటి? అనుకుంటున్నారా..?. అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఇది మా సొంత అభిప్రాయం ఎంత మాత్రం కాదండోయ్. సినిమా వ్యవహారాల్లో తలపండిన ఫిల్మ్ నగర్ సీనియర్ల అభిప్రాయం. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ప్రస్తుతం టాలీవుడ్‌లో నెం.1 స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా ఆస్థానాన్ని ఏ హీరో కూడా ఆక్రమించ లేదు. నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ..కెరీర్ చివర్లో ఉన్న వారు దానిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక ప్రస్తుతం ఆ స్థానం కోసం పోటీ పడుతున్న యువ హీరోల్లో రేసులో ఉన్నవారిలో మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ ముఖ్యులు. ఇప్పుడు ఎవరు ఆ స్థానం దక్కించుకోబోతున్నారనేదే ఇక్కడ పాయింట్.

ఇప్పటికే దూకుడుగా వచ్చిన మహేష్ బాబు అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతూ రాకెట్‌లా దూసుకెలుతున్నాడు. మాసు, క్లాసు, కామెడీ ఎలిమెంట్స్ తో వచ్చిన దూకుడు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. మహేష్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోనే దూకుడు బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయం అంటున్నా క్రిటిక్స్. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లిగా ప్రేక్షకుల ముందు ల్యాండ్ అవుతున్నాడు. ఊసరవెల్లిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఎన్ని అంచనాలు ఉన్నప్పటికీ ఊసరవెల్లి సినిమా దూకుడును అధిగమించడం కష్టం అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఊసరవెల్లిఃలో ఫుల్ క్లాస్ మూవీ, ఇందులో మాస్ ఎలిమెంట్స్ లేవనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు సినిమాలో హీరోతో సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటుందని నిన్న ఎన్టీఆర్ తన ప్రెస్ మీట్ లోనే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఊసరవెల్లి హిట్ టాక్ వచ్చినా ‘దూకుడుః’ అంతటి దూకుడు ప్రదర్శించడం కష్టమే అంటున్నారు.

మరి ఎప్పటి నుండో టాలీవుడ్ నెం.1 స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న జూ ఎన్టీఆర్ కు, తమ అభిమాన హీరోను నెంబర్ స్థానంలో చూసుకుని మురిసిపోదామని ఆశ పడుతున్న అభిమానులకు పండగ పూట ఈ వార్త బ్యాడ్ న్యూస్ కాకుంటే మరేమిటి...? చూద్దాం.. ఏం జరుగబోతోందో?

No comments:

Post a Comment