Saturday, August 20, 2011

మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, నాగబాబు...


         ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల పరంగా బిజీగా ఉన్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడానికి చిరు సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఈ ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. ప్రతి యేడాది స్టేట్ మొత్తం, ఇతర ప్రదేశాల్లో కూడా చిరు బర్త్ డేని ఆయన అభిమానులు గ్రాండ్ గా జరుపుకుంటారు. ఈ యేడాది కూడా కొంచె డిఫరెంట్ గా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిరంజీవి పుట్టినరోజుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అందుకు రాష్ట చిరంజీవి యువత 21వ తేది రాత్రి నుండి కార్యక్రమాలు మమ్మురం చేస్తున్నారని సమాచారం.

        ఈ వేడుకల్లో మెగాక్యాంప్ లోని టాప్ పర్సనాలిటీస్ అయిన రామ్ చరణ్ తేజ్, నాగబాబు, అల్లు అరవింద్ పాలు పంచుకోనున్నారని సమాచారం. చిరంజీవి ఢిల్లీలో బిజీగా ఉంటే ఇక్కడ అభిమానులు నిరాశపడకూడదనే చరణ్, నాగబాబు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని సమాచారం. శిల్పాకళా వేదికలో మొన్న దూకుడు ఆడియో కళ తగ్గక ముందే మెగా వేడుకను ప్రారంభించడంతో ప్రాంగనం అంతా ఆహ్లాదకరంగా ఉందని సమాచారం.


No comments:

Post a Comment