Sunday, August 21, 2011

సల్మాన్ ని కాపీ కొట్టాలనే వెంకటేష్

సల్మాన్ ఖాన్ కి వచ్చిన ఓ ఐడియాని బాడీగార్డు ప్రమోషన్ లో వాడుతున్నారు ఆ నిర్మాతలు.అదే ఐడియానికి కాపీ కొట్టాలనే ఆలోచనలో వెంకటేష్ తలములకలై ఉన్నారని తెలుస్తోంది.వివరాల్లో కి వెళితే...మలయాళంలో రూపొందిన ‘బాడీగార్డ్’ చిత్రం సల్మాన్, కరీనాకపూర్ జంటగా అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది.మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధిక్కే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్, కరీనా కపూర్‌లకు బాడీగార్డ్‌గా వ్యవహరించే అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఈ ఇద్దరూ విడివిడిగా 15 నగరాలకు వెళ్లి ‘బాడీగార్డ్’ని ప్రమోట్ చేస్తారు.అందాల తార కరీనాకపూర్‌కి ఒక రోజంతా బాడీగార్డ్‌గా వ్యవహరించే అవకాశం వస్తే... ఆ చాన్స్‌ని అందిపుచ్చుకోవడానికి ఎంతోమంది క్యూలో నిలబడతారు. అలాగే సల్మాన్ ఖాన్‌కి బాడీగార్డ్‌గా చేయాలన్నా క్యూ కట్టేవారు ఉంటారు. ‘బాడీగార్డ్’ నిర్మాత అతుల్ అగ్నిహోత్రి ఈ అవకాశాన్ని కల్పించబోతున్నారు.

ఏ నగరంలోకి వెళితే ఆ నగరానికి చెందిన వ్యక్తుల్లో ఓ వ్యక్తిని బాడీగార్డ్‌గా ఎన్నుకుంటారట. అలా ఎంపికైన బాడీగార్డ్ సదరు తారలను నీడలా వెంటాడాల్సి ఉంటుంది.ఇప్పుడా ఐడియానికి వెంకటేష్ తెలుగులో ప్రమేట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే వెంకటేష్ కూడా అదే రీమేక్ ని తెలుగులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చి్త్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.


No comments:

Post a Comment